వడ‘దెబ్బ’ కొడుతుంది..
సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలకు మించి వాతావరణం వేడెక్కి వేడి గాలులు రావడాన్ని వడగాలులు అంటారని తెలిసిందే. వడగాలి ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. వేడి తిమ్మిర్లు (హీట్ క్రాంప్) వస్తాయి. దీంతో నీరసం, సత్తువ తగ్గడం, కళ్లు తిరగడం, తలనొప్పి రావడం, వాంతులు కావడం జరుగుతాయి. వేసవి మనపై ఎలాంటి ప్రభావం చూపుతుంది, వడగాలుల నుంచి ఎలా రక్షించుకోవాలి, ఏ పనులు చేయకూడదోవడదెబ్బ రాకుండా ఉండడం కోసం అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నేపథ్యంలో అవసరం ఉంటే మాత్రమే మధ్యాహ్నం టైంలో బయటకు వెళ్లాలి లేదంటే బయటకు వెళ్లడం వల్ల ఎండ వేడి గాలుల వల్ల అనారోగ్యానికి గురయ్యా అవకాశాలు ఉన్నాయి మీకోసం కోటి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లో పనిచేస్తున్న డాక్టర్ మనోజ్ రెడ్డి అండ్ దీస్తున్న సలహాలు సూచనలు ఈ విధంగా ఉన్నాయి ఆ వివరాలు మీ కోసం...
నీళ్లు, మజ్జిగ అధికంగా తీసుకోవాలి..
వేసవికాలం నేపథ్యంలో రోజూ సాధ్యమైనన్ని నీళ్లు తాగడం మాత్రమే కాకుండా, చల్లటి మజ్జిగ తీసుకోవడం ఉత్తమం. వేళకు ఆహారం, పండ్ల రసాలు లాంటివి తీసుకుంటే ఎండల నుంచి కాస్తయినా ఉపశమనం లభిస్తుంది. మామిడికాయ తింటే సోడియం క్లోరైడ్, ఐరన్‌లను కోల్పోకుండా, డీ హైడ్రేషన్‌న్‌కు గురి కాకుండా చేస్తుంది. విటమిన్ సి ఎక్కువ ఉండే ఆరెంజ్ పండ్లు రోగనిరోధ శక్తిని పెంచుతాయి. కొబ్బరి నీళ్లు తాగితే ఖనిజ లవణాలు, ఎలక్ట్రోలైట్స్ లభించి మండు వేసవిలో అది మనకు ఔషదంలా పని చేస్తుంది.