*వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోండి*
అదిలాబాద్ (ఆరోగ్యజ్యోతి): ఎండాకాలం వచ్చింది ప్రమాదం ఉందని వడదెబ్బ ఎలా వస్తుంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఆదిలాబాద్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. ఆరోగ్య జ్యోతితో తెలిపారు
భారత వాతావరణ విభాగం అధికారుల సూచన మేరకు రాబోయే రోజుల్లో విపరీతమైన వేడి గాలులు వేడి వాతావరణం నెలకొంటున్న తరుణంలో జిల్లా ప్రజలందరూ అప్రమత్తమై వివిధ పనులు చేసేవారు ముఖ్యంగా ఎండలో పనిచేసే సాధారణ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం సుదర్శనం గారు తెలియజేశారు.
*వడదెబ్బకు గురికాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు*
*చేయవలసినవి*
*సరిపడా ద్రవాలు తీసుకోవడం*
*మీకు దాహం వేయకపోయినా వీలైనప్పుడల్లా తగినంత నీరు త్రాగండి.
*ప్రయాణించేటప్పుడు తాగునీరు తీసుకెళ్లాలి.
*ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఓఆర్ఎస్ ద్రావణాన్ని ఉపయోగించాలి మరియు నిమ్మరసం మజ్జిగ పండ్ల రసాలు వంటింట్లో తయారు చేసిన పానీయాలను కొద్దిగా ఉప్పు కలిపి త్రాగాలి.
*పుచ్చకాయ కర్బూజా ఆరెంజ్, ద్రాక్ష పైనాపిల్ దోసకాయ ,కొబ్బరి బొండం, వంటి అధిక నీటి పరిమాణం కలిగి ఉన్న సీజనల్ పండ్లు మరియు కూరగాయలను తినాలి.
*ధరించండి*
*సన్నని వదులుగా లేత రంగులో ఉండే కాటన్ వస్త్రాలను ధరించడం మంచిది.
*మీ తల నేరుగా సూర్యరశ్మికి బహిర్గతమయ్యే సమయంలో గొడుగు టోపీ టవల్ మరియు ఇతర సాంప్రదాయ తలపాగను ఉపయోగించాలి.
*ఎండలో బయటకు వెళ్లేటప్పుడు బూట్లు లేదా చెప్పులు ధరించాలి.
*అప్రమత్తంగా ఉంటూ వీలైనంతవరకు ఇంట్లోనే ఉండండి*
*బాగా గాలి వెలుతురు మరియు చల్లని ప్రదేశాలలో ఉండాలి.
*ప్రత్యక్ష సూర్యకాంతి మరియు వేడి గాలుల బారిన పడకుండా నిరోధించాలి.
*బయట మీ కార్యకలాపాలను రోజులోని చల్లని సమయాలకు అంటే ఉదయం మరియు సాయంత్రం వరకు పరిమితం చేయాలి.
*తొందరగా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉన్నవారు*
కొంతమంది వ్యక్తులు ఇతరుల కన్నా ఎక్కువ ప్రమాదానికి లోనయ్యే అవకాశం ఉంటుంది వారిపట్ల అదనపు జాగ్రత్త వహించాలి.
*వారు ముఖ్యంగా*
శిశువులు మరియు చిన్న పిల్లలు ,గర్భిణీ స్త్రీలు, ఆరుబయట పనిచేసే వ్యక్తులు, మానసిక వ్యాధి ఉన్న వ్యక్తులు, శారీరకంగా అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు, ముఖ్యంగా గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటు ఉన్నవారు, చల్లటి వాతావరణం నుండి వేడి వాతావరణం కి వచ్చే వ్యక్తులు, అలాంటి వ్యక్తులు వడగాలుల సమయంలో బయట సందర్శిస్తున్నట్లయితే వారి శరీరాలు వేడికి అలవాటు పడటానికి ఒక వారం సమయం పడుతుంది దీనికోసం పుష్కలంగా నీరు త్రాగాలి వేడి వాతావరణానికి అలవాటు పడటానికి శారీరక కార్యకలాపాలను క్రమంగా పెంచడం ద్వారా ఈ పరిస్థితులకు అలవాటు పడవచ్చు.
*ఇతర ముఖ్యమైన జాగ్రత్తలు*
*ఒంటరిగా నివసించే వ్యక్తులు, వృద్ధులు లేదా అనారోగ్యంతో ఉన్న వ్యక్తులను ప్రతిరోజు పర్యవేక్షించాలి మరియు వారి ఆరోగ్యాన్ని కాపాడాలి.
*మీ ఇంటిని చల్లగా ఉంచండి కర్టెన్లు షెటర్లు లేదా చలువ పందిళ్ళను ఉపయోగించండి మరియు రాత్రివేళ కిటికీలను తెరవాలి.
*పగటిపూట దిగివ అంతస్తులలో ఉండటానికి ప్రయత్నించాలి.
*శరీరాన్ని చల్లపరచడానికి ఫ్యాను తడి బట్టలను ఉపయోగించాలి.
*చేయ కూడనివి*
*ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుండి మూడు గంటల మధ్య ఎండలో బయటకు రాకుండా ఉండాలి.
*మధ్యాహ్నం బయట ఉన్నప్పుడు శారీరక కష్టంతో కూడిన కార్యకలాపాలకు దూరంగా ఉండాలి.
*చెప్పులు లేకుండా బయట వెళ్ళవద్దు.
*వేడి ఎక్కువగా ఉండే సమయంలో వంట చేయడం మానుకోవాలి వంట ప్రదేశాన్ని తగినంతగా గాలి వెళ్తురు ఆడటానికి తలుపులు మరియు కిటికీలను తెరవాలి.
*ఆల్కహాల్ టీ కాఫీ మరియు కార్బోనేటెడ్ శీతల పానీయాలు లేదా పెద్ద మొత్తంలో చక్కెరతో కూడిన పానీయాలను నివారించాలి ఇవి వాస్తవానికి ఎక్కువ శరీర ద్రవాన్ని కోల్పోవడానికి లేదా కడుపునొప్పికి దారి తీయవచ్చు.
*అధిక మాంసకృతులు కలిగిన ఆహారాన్ని తినవద్దు మరియు నిల్వహారాన్ని తినవద్దు.
*నిలిపి ఉంచిన వాహనంలో పిల్లలను వదిలివేయవద్దు వాహనం లోపల ఉష్ణోగ్రత పెరిగి ప్రమాదకరంగా మారవచ్చు.
*పని ప్రదేశాల్లో యజమానులు వారి వద్ద పనిచేసే కార్మికుల పట్ల అశ్రద్ధ చేయరాదు.
*వడదెబ్బ లక్షణాలు పెద్దలలో*
*అయోమయం గందరగోళం మరియు ఆందోళన చిరాకు అటాసియా మోర్చా లేదా కోమా.
*వేడి ఎరుపు మరియు పొడి చర్మం శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువగా మారడం.
*తలనొప్పి మైకము మరియు మూర్చ.
*కండరాల బలహీనత లేదా తిమ్మిరి వికారం మరియు వాంతులు.
*హృదయ స్పందన పెరగడం లేదా శ్వాస పెరగడం.
*చిన్నపిల్లల్లో వడదెబ్బ లక్షణాలు*
*ఆకలి లేకపోవడం, విపరీతమైన చిరాకు.
*మూత్ర విసర్జన తగ్గడం.
*పొడి నోటీసులేష్మం మరియు కన్నీరు గుంతలు పడిన కళ్ళు.
*మగత/ మతిస్థిమితం లేకపోవడం ,మూర్ఛ.
*ఏదైనా భాగం నుండి రక్తస్రావం.
*ఇతర జాగ్రత్తలు మరియు సూచనలు*
*సహాయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆ వ్యక్తిని వెంటనే చల్లని ప్రదేశానికి మార్చాలి.
*మీకు వీలైతే వారిని చల్లని ప్రదేశానికి తరలించాలి.
*చల్లని నీటితో శరీరాన్ని తుడవాలి.
*వ్యక్తికి వీలైనంత గాలి తగిలే విధంగా జాగ్రత్త వహించండి.
*మీ దగ్గరలోని ఆశా కార్యకర్తను లేదా ఏఎన్ఎం ను సంప్రదించండి.
*మీ మీ దగ్గరలోని ఆరోగ్య ఉప కేంద్రాన్ని లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి.
*అధిక శరీర ఉష్ణోగ్రత, అపస్మారక స్థితి, గందరగోళం, చెమటలు పెట్టకపోవడం, ఎవరిలోనైనా కనిపిస్తే 108 కి కాల్ చేయండి.