ఆదిలాబాద్,(ఆరోగ్య జ్యోతి) జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో కిడ్నీ వ్యాధితో గత కొన్ని రోజులుగా బాధపడుతున్న బాధితుని *యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి* ఆదివారం రిమ్స్ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.రెండు కిడ్నీలలో నెలకొన్న అనారోగ్య కారణాలతో గత కొన్ని రోజులుగా అవస్థలకు గురవుతున్న *బేల మండలంలోని పోవర్ గ్రామానికి చెందిన ఆత్రం శ్రీ రామ్*అనే వ్యక్తి బాధపడుతున్నాడు.దీంతో పరిస్థితి క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు.ఈ క్రమంలో రిమ్స్ ఆసుపత్రికి వెళ్ళిన *యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి* బాధితున్ని అడిగి ఆయనను పరామర్శించారు.
వైద్యులు ఆత్రం శ్రీ రామ్కు మెరుగైన వైద్యం అందించాలని కోరిన సామ రుపేష్ రెడ్డి బాధితునికి ఎలాంటి ప్రమాదం లేదని,అధైర్య పడద్దని జబ్బు నయమవుతుందని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.దీంతో కుటుంబ సభ్యులు సామ రూపేష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపగా డయాలసిస్ బాధితునికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని సామ రూపేష్ రెడ్డి వైద్యులను కోరారు.