రిమ్స్ ఆస్పత్రికి ప్రసూతి కోసం వచ్చే మహిళలకు అన్ని రకాల వైద్య సేవలు అందించాలి
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451, 9848289499
- డి ఎం ఎన్ హెచ్ ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్
అదిలాబాద్ రిమ్స్, (ఆరోగ్య జ్యోతి): రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి కి ప్రసూతి కోసం వచ్చే వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేంద్ర రాథోడ్ అన్నారు. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న ఆహార నీ ఆయన పరిశీలించారు. టాస్క్ ఫోర్స్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ మరియు రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్ ఆర్ ఎం ఓ డాక్టర్ సాయి ల ఆధ్వర్యంలో పరిశీలించారు. రిమ్స్ ఆస్పత్రి ఆవరణలోని గైనిక్ వార్డులో రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీమ్స్ ఆస్పత్రికి ఎక్కువగా గిరిజన గ్రామీణ ప్రాంతాల నుండి పేద ప్రజలు వస్తారని ప్రసూతి అయేంతవరకు వైద్యులు మరియు వైద్య సిబ్బంది పారామెడిక సిబ్బంది ఇతర సిబ్బంది వారికి అన్ని రకాల సేవలు అందించడంతోపాటు సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. రక్తహీనతతో బాధపడుతున్న వారిని గుర్తించి వారికి అవసరం ఉన్న రక్తాన్ని అందించడంతోపాటు తగు చికిత్సలు అందించాలని తెలిపారు. వీరి వెంట హెడ్ నర్స్ పద్మ, రవీందర్, నిఖిల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.