సోమవారం ఏఎన్ఎం పరీక్ష ఫలితాలు?...
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
తెలంగాణ బ్యూరో, (ఆరోగ్య జ్యోతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఏఎన్ఎం) ఉద్యోగుల కోసం 2024 డిసెంబర్ 29న రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించారు. 1931 ఏఎన్ఎం పోస్టులకు గాను సుమారు 20600 మంది అభ్యర్థుల పరీక్షలు రాశారు. ఈ పరీక్ష విధానం అంతా కంప్యూటర్ ద్వారానే రాశారు. అయితే ప్రభుత్వం పరీక్ష ఫలితాలను సోమవారం రోజు విడుదల చేస్తున్నట్టు విశ్వాసనీయ సమాచారం?. తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్వెస్ట్మెంట్ బోర్డ్ నిర్వహించిన మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫిమేల్ పరీక్ష ఫలితాలు సోమవారం రోజు విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. పరీక్షలు రాసిన ఆరోగ్య కార్యకర్తలు రేపు మాకు పరీక్ష ఫలితాలు వస్తాయని ఎంతో ఆశతో ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. సోమవారం రోజు ప్రభుత్వం పరీక్ష ఫలితాలను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.