Sports & Games

Breaking News

ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించుకోవాలి

.*ఆరోగ్యకర జీవనశైలిని పెంపొందించుకోవాలి*

 *డీఎల్ఎస్ఏ కార్యదర్శి సాయికుమార్*


*వరంగల్,(ఆరోగ్య జ్యోతి):చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఆ రోగ్యకర జీవనశైలిని పెంపొందించుకోవాలని వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.సాయికుమార్ సూచించారు. *ప్రపంచ ఆరోగ్య దినోత్సవం* సందర్భంగా సోమవారం నగరంలోని ప్రభుత్వ బాలుర పరిశీలక గృహంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి క్షమా దేశ్ పాండేతో కలిసి ప్రారంభించారు. ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ కొంత సమయం వ్యాయామం చేయాలన్నారు. ముఖ్యంగా దూమపానం, మత్తు పదార్థాలు లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. బాలురకు ఆరోగ్యంపై అవగాహన తోపాటు న్యాయ సేవా సంస్థ విధులు, బాలల హక్కులపై అవగాహన కల్పించారు. అనంతరం బాలురకు టూత్ బ్రష్లు, పండ్లు అందించారు. జిల్లా లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పి.శ్రీనివాసరావు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్. ఏం. యశస్విని, డెంటల్ స్పెషలిస్ట్ భరత్, పరిశీలక గృహం సూపరింటెండెంట్ శ్రీదేవి, సూపర్వైజర్ నర్మద, 
ఏ.ఎన్.ఎం.ప్రేమలత , రామ రాజేష్ ఖన్నా, ఆశ కార్యకర్త నాగమణి తదితరులు పాల్గొన్నారు.