Sports & Games

Breaking News

హామీలు నెరవేరేంతవరకు పోరాటాలు ఆగవు

హామీలు నెరవేర్చే వరకూ పోరాటం ఆగదు*

*ఎఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ్మ

హైదరాబాద్,(ఆరోగ్య జ్యోతి)  : నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న రెండవ ఏ ఎన్ ఎంలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాటం ఆగబో దని ఎఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ అన్నారు. రెండవ ఎఎన్ఎంలకు ఎఐటియుసి ఆధ్వర్యంలో చేసిన సమ్మె నేపథ్యంలో వయసు రీత్యా పరీక్షకు అర్హత లేని వారిని 100 శాతం మూల వేతనంతో పాటు 7 నెలల పిఆర్సి వేతన బకాయిలు, రూ.10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, రూ.10 లక్షల లైప్ ఇన్సూరెన్స్, సబ్ సెంటర్ అద్దె బకాయిలు, ఎవిడి వ్యాక్సిన్ బకాయిలు చెల్లిస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఫిబ్రవరి 17వ తేదీన జరిగిన చర్చల్లో భాగంగా మార్చి 31వ తేదీ లోపు 7 నెలల పిఆ రీసి బకాయిలను చెల్లిస్తామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. 2020లో పిఆర్సిప్రకటన చేయగా, 2021 జూన్ 11న అమల్లోకి రాగా, ఆ తర్వాత 7 నెలలకు జీతాలు పెరిగాయని ఆయన గుర్తు చేశారు. ఎఐటియుసి ఆధ్వర్యంలో జరిగిన పోరాటాలలో పిఆర్సి బకాయిలను చెల్లిస్తామని అనేక సార్లు హామీ ఇచ్చి నెరవేర్చ లేదన్నారు. వీరితో పాటే పని చేస్తున్న ఇసి ఎఎ న్ఎంలకు 2023 వ సంవత్సరంలోనే పిఆర్సి బకాయిలు చెల్లించారని కానీ రెండవ ఎ.ఎన్.ఎం.లకు ఇంతవరకు చెల్లించకపోవడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తెలంగాణ రాష్ట్ర రెండవ ఎఎన్ఎంల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు తోట రామాంజనేయులు, సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జక్కుల పద్మ, బోయిని శ్యామల, రాష్ట్ర కార్యదర్శులు తన్వీర్ సుల్తానా, పి జయమ్మ, ఎస్ సంధ్యారాణి, ఉపాధ్యక్షులు కే.పద్మ, కృష్ణవేణి, పార్వతి, భారతి, కోశాధికారి రాజేశ్వరి రెడ్డి, రాష్ట్ర కార్య వర్గ సభ్యులు యాదాలక్ష్మి, సరస్వతి, రాణి, బాలనాగమ్మ, గిరిజా రెడ్డి, ఆభేద, సునీత, వినోద, సల్వాది నిర్మల, వనజ, శ్రీలక్ష్మి, సుమిత్ర పాల్గొన్నారు.