Sports & Games

Breaking News

రోగి ఆసుపత్రి కి చికిత్స కోసం వెళితే ఆధార్ తప్పనిసరిగా తీసుకువెళ్లాలి - జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్

అదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రికి రోగి వైద్యం కోసం వెళ్ళినప్పుడు ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకపోవాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేంద్ర రాథోడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 18 నుంచి ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగి తప్పకుండా తమ వెంట ఆధార్ కార్డు తీసుకొని వెళ్లాలని తెలిపారు. ఆధార్ కార్డు రోగి తీసుకొని వెళ్లడం ద్వారా రోగికి సంబంధించిన అనారోగ్య సమస్యల మొత్తం కంప్యూటర్లో ఫీడ్ చేయడం జరుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో రోగే కి అందించిన సేవలు వివరాలు తెలుసు కొనుటకు వీలుంటుందని తెలిపారు. ఇందుకుగాను రోగి జిల్లాలోని ఏ ప్రభుత్వ ఆసుపత్రి కి పొందే సమయంలో ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకపోవాలని తెలిపారు. రిమ్స్ ఆస్పత్రి కానీ సామాజిక ఆత్పత్తులలో కానీ ప్రాథమిక పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉనికి చికిత్సల కొరకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా ఆదాడు వెంటపెట్టుకొని పోవాలని తెలిపారు.