Sports & Games

Breaking News

చిన్నారి వరలక్ష్మి జన్మదిన సందర్భంగా రిమ్స్ లో అన్నదానం

.ఆదిలాబాద్ రిమ్స్, (ఆరోగ్య జ్యోతి): చింతావర్ వరలక్ష్మి జన్మదిన సందర్భంగా రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో రోగులకు మరియు రోగి బంధువులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమం తోపాటు ప్రతి సంవత్సరం చింతావర్ వరలక్ష్మి జన్మదిన సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. చింతావర్ వరలక్ష్మి జన్మదిన సందర్భంగా ఈ సంవత్సరం రోగులకు అన్నదాన కార్యక్రమం చేయాలని ఈరోజు అన్నదానం చేయడం జరిగిందని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా అనేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. వరలక్ష్మి జన్మదిన సందర్భంగా అన్నదానం చేయడం ఎంతో సంతోషకరంగా ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ వారి వారి జన్మదిన కానీ పెళ్లిరోజు కానీ ఇతర శుభకార్యాల సందర్భంగా రిమ్స్ ఆసుపత్రిలో అన్నదానం చేస్తే రోగులు రోగుల బంధువులకు ఎంతో పుణ్యం చేసిన వారమవుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చింతావర్ కృష్ణ పుష్ప లక్ష్మి శ్రీనివాస్ ఆచారి తదితరులు ఉన్నారు.