క్షణ తరగతుల్లో భాగంగా ఆదిలాబాద్ రూరల్ మండలంలో పర్యటించిన శక్తి అభియాన్,ఇందిరా ఫెలోషిప్ సభ్యులు
ఆదిలాబాద్ రూరల్: మూడురోజుల శిక్షణ తరగతుల్లో భాగంగా ఆదివాసీల జీవన విధానాన్ని తెలుసుకోవటానికి వివిధ రాష్ట్రల నుంచి వచ్చిన శక్తి అభియాన్,ఇందిరా ఫెలోషిప్ సభ్యులు ఆదిలాబాద్ రూరల్ మండలంలో పర్యటించారు.ఇందులో భాగంగా శక్తి అభియాన్ సభ్యులు ఐదు బృందాలుగా విడిపోయి ఖండాల, పోతగూడ,దార్ లొద్ది,చీచ్ ధరి, పోయిటంలొద్ది, ఆలికోరి గ్రామాల్లో బుధవారం రాత్రి బస చేశారు.గురువారం ఉదయమే ఆదివాసీలతో కలిసి రోజువారి పనుల్లో భాగంగా ఇంటి పని, వ్యవసాయ పనులు, చేపలు పట్టటం, వెదురు బొంగులతో బుట్టలు అల్లటం తదితర పనుల్లో పాల్గొన్నారు.గ్రామాల్లో రాయి సెంటర్ వ్యవస్థ,ఆదివాసీల జీవన విధానం,సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకుని వారు తినే ఆహారాలను రుచి చూసారు.గూడాల్లో పర్యటించిన సభ్యులకు ఆదివాసీలు వారి సాంప్రదాయం ప్రకారం ఘనంగా స్వాగతం పవలికారు.ఉమ్మడి జిల్లా ఇందిరా ఫెలోషిప్ కోఆర్డినేటర్,కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జి ఆత్రం సుగుణక్క ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమాల్లో శక్తి అభియాన్ జాతీయ చైర్మన్ మణిశర్మ,జాతీయ కోఆర్డినేటర్ డాక్టర్.సౌజన్య, రాష్ట్ర కోఆర్డినేటర్ శివలాల్,కృష్ణ అల్లావర్, విజయలక్ష్మి,కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి,వివిధ రాష్ట్రాలకు చెందిన శక్తి అభియాన్ కోఆర్డినేటర్లు,ఉమ్మడి జిల్లాకు చెందిన ఇందిరా ఫెలోషిప్ సభ్యులు కృష్ణవేణి,కోవ ఇందిర,కనక ప్రతిభ, కుంరం సింధు,ఆదివాసీ నాయకులు యశ్వంత్ రావుమహారాజ్,సార్ మెడీ,కోరేంగా దౌలత్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆత్రం సుగుణక్క మాట్లాడుతూ శిక్షణలో భాగంగా ఆదివాసి చట్టాలు,ఆదివాసి ఉద్యమాలు,అటవీ హక్కులపై సభ్యులకు వివరించటం జరిగిందని తెలిపారు.దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ జిల్లాలో మూడు రోజులపాటు శక్తి అభియాన్ శిక్షణ తరగతులు జరుగుతున్నాయని తెలిపారు. మహిళల హక్కులు, రాజకీయంగా,సామాజికంగా, ఉద్యోగ పరంగా హక్కుల కోసం పోరాటం చేయడానికి ఒక వేదిక కావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు శక్తి అభియాన్ సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

