రోగులకు వైద్య సేవలు అందించడంలో ముందుండాలి - తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
- మందులకోరత లేకుండా చూడాలి
- ప్రైవేట్ ఆస్పత్రులకు రేపర్ చేయొద్దు
- ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి
- ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రసూతి కావాలి
- వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
తెలంగాణ బ్యూరో, (ఆరోగ్య జ్యోతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రులు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు వచ్చే రోగులకు అన్ని రకాల వైద్య సేవలు అందించాలని తెలంగాణ వైద్య మరియు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డైరెక్టర్లతో మంత్రి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు అన్ని రకాల వైద్య సేవలు అందించాలని సూచించారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయంలో ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ టూటర్ పోస్టులను వైద్య కళాశాలలో భర్తీ చేయడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. కొన్ని కళాశాలలో పోస్టుల భర్తీ పూర్తయిందని కొన్ని కళాశాలలో ఇంకా కొన్ని రకాల పోస్టులను భర్తీ చేయవలసిందని ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ జారీ చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 7,000 పైగా స్టాఫ్ నర్స్ రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయడం జరిగిందన్నారు. ఇటీవల స్థాపనర్స్ పోస్టులకు నోటిఫికేషన్ కూడా జారీ చేశామని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్యశాఖ తెలంగాణ వైద్య విధాన పరిషత్ తో పాటు వైద్య కళాశాలలో అన్ని రకాల వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకోవచ్చామని తెలిపారు. వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రులు మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా చూసుకోవాలని తెలిపారు సౌకర్యాలు ఏదైనా అవసరం ఉంటే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని మంత్రి పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న సెంట్రల్ డ్రగ్స్టోర్లను కొత్త జిల్లాలో కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ప్రస్తుతం అన్ని వైద్య కళాశాలకు వెంటనే మందులు తీసుకువెళ్లే సౌకర్యాన్ని కూడా కల్పించామని మంత్రి పేర్కొన్నారు. త్వరలో అన్ని వైద్య కళాశాలలో ఐవిఎఫ్ లాంటి సౌకర్యాలు కూడా కల్పించనున్నట్టు మంత్రి చెప్పారు. ఇటీవల గాంధీ ఆసుపత్రిలో ఐవీఎఫ్ సెంటర్ ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఏది ఏమైనాప్పటికీ పేద బడుగు బలహీన గిరిజన గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ముందుండాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.