Sports & Games

Breaking News

అంకోలి అంగన్వాడి కేంద్రం లో చిన్నారులతో కలసి బొంచేసిన జిల్లా పాలనాధికారి రాజర్షి షా.

ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఫ్రై డే డ్రై డే సందర్భంగా జిల్లా పాలనాధికారి రాజర్షి షా ఆంకోలి గ్రామం లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫ్రై డే డ్రై డే కార్యక్రమాలు పక్కాగా నిర్వహించాలని, ఇంటి పరిసరాల్లో ఉన్న కుండీలు, డ్రమ్ములు, వాడుకలో లేని వస్తువులలో ఉండే నీరు వల్ల దోమలు, ఈగలు చేరి అనారోగ్యానికి గురిచేస్తాయని, అటువంటి వాటిలో నీటిని తొలగించాలని ఆన్నారు.అనంతరం గ్రామ పంచాయితీ కార్యాలయం సందర్శించి ఫైనల్ ఓటరు జాబితా ను పరిశీలించి, అంగన్వాడి కేంద్రం లో చిన్నారులతో భోజనం చేశారు.స్వచ్చత హీ సేవా లో భాగంగా అంకోలి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో మొక్కలు నాటి ఆసుపత్రిని సందర్శించారు.ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి పద్మభూషణ్, DRDO సాయన్న, dlpo ఫణీంద్ర, ఎంపిడిఓ నాగేశ్వర్ రెడ్డి, వైద్యాధికారులు,తదితరులు ఉన్నారు.