Sports & Games

Breaking News

రోగులకు సేవ చేయడంలో ఫార్మసిస్ట్ పాత్ర కీలకం

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 
ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ 

వైద్యులు రాసిన మందులను అర్థం చేసుకొని సరియైన మందులను వ్యాధిగ్రస్తులకు ఇవ్వడంలో రోగి చికిత్సలో ఫార్మాసిస్ట్ ల పాత్ర కీలకమని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ అన్నారు ప్రపంచ ఫార్మాసిస్ట్ ల దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా క్రోసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫార్మాసిస్ట్ గా పనిచేస్తున్న ఫాతిమాను పీహెచ్సీ సిబ్బంది బొకె తో బుధవారం సత్కరించారు ఈ సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ మాట్లాడుతూ ఫార్మా సిస్ట్ లు ఆరోగ్య రక్షణ రంగ వ్యవస్థల్లో అంతర్భాగమని ఆరోగ్య అవసరాలు తీర్చటంలో వారిది ముఖ్యపాత్ర అన్నారు ఆవశ్యకత ఔషధాలు అందించుట వాటి సరియైన వినియోగం చూచుట ఫార్మా శిష్ట్ ల ప్రధాన విధి అన్నారు ఔషధాన్నిపునులుగా రోగి సంరక్షణ, ప్రజారోగ్య పరిరక్షణలో వారి భూమిక ముఖ్యమైందని పేర్కొన్నారు హాస్పిటల్ కమ్యూనిటీ పరిశ్రమ పరిశోధన బోధన ఔషధ నియంత్రణ శాఖ వంటి భిన్న రూపాలలో ఫార్మసిస్టులు ప్రజలకు సేవలు అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు ఫార్మసిస్టులు కోవిడ్ 19 సమయంలో ముందు వరుసలో ఉండి ఆరోగ్య సంక్షోభాలు అధిగమించటానికి తోడ్పడిన విషయం అందరికీ తెలుసు అన్నారు ఫార్మాసిస్టుల మేలు ప్రజల ఆరోగ్యానికి మేలు అని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు జ్యోతి, స్టాఫ్ నర్స్ రాణి, ల్యాబ్ టెక్నీషియన్ ప్రభాకర్ రావు, ఆరోగ్య కార్యకర్త లు పాల్గొన్నారు