Sports & Games

Breaking News

జ‌పాన్‌కు వ‌స్తాన‌ని మహిళ అభిమానికి మాటిచ్చిన ఎన్టీఆర్‌

టాలీవుడ్‌తో పాటు ప్ర‌పంచ‌మంత‌టా ప్ర‌స్తుతం దేవర సందడి నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఆరేండ్ల త‌ర్వాత ఎన్టీఆర్ సోలోగా రావ‌డంతో అటు ఫ్యాన్స్‌తో పాటు మూవీ ల‌వ‌ర్స్ దేవ‌ర సినిమా చూసి సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా, కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రాగా.. జాన్వీకపూర్‌ కథానాయికగా న‌టించింది. సైఫ్‌ అలీఖాన్ విల‌న్‌గా న‌టించాడు. నందమూరి కల్యాణ్‌రామ్ స‌మ‌ర్పించగా.. మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా వ‌రల్డ్ వైడ్‌గా స‌క్సెస్‌పుల్‌గా రన్ అవుతుండ‌గా.. అమెరికాలోని లాస్‌ ఏంజెలిస్‌లో జ‌రుగుతున్న ప్రతిష్ఠాత్మక బియాండ్‌ ఫెస్ట్‌వ‌ల్‌లో ఈ సినిమాను ప్ర‌ద‌ర్శించారు. ఈనేపథ్యంలోనే బియాండ్‌ ఫెస్ట్‌లో పాల్గొన్న ఎన్టీఆర్‌ (NTR).. అభిమానులతో కలిసి సినిమా వీక్షించారు. అనంతరం తనని కలిసేందుకు వచ్చిన పలువురు అభిమానులతో ముచ్చటించారు.అయితే ఈ ఫెస్ట్‌లో ఎన్టీఆర్‌ను క‌లిసేందుకు ఒక మ‌హిళ అభిమాని జ‌పాన్‌లోని టోక్యో నుంచి జర్నీ చేసి లాస్‌ ఏంజెలిస్‌కు చేరుకుంది. బియాండ్‌ ఫెస్ట్‌వ‌ల్‌లో ఎన్టీఆర్‌ను క‌లుసుకుని మాట్లాడింది. అయితే తార‌క్‌ను చూడ‌గానే ఒక్క‌సారిగా ఎమోష‌న‌ల్ అయ్యింది ఆ అభిమాని. తార‌క్‌తో మాట్లాడుతూ.. మిమ‌ల్ని చూసేందుకు ఎంతోమంది అభిమానులు జపాన్‌లో ఎదురుచూస్తున్నారని.. తమ దేశానికి రమ్మని ఆహ్వానించింది. ఆమె మాటలకు ఎన్టీఆర్‌ ఆనందం వ్యక్తంచేశారు. తప్పకుండా వస్తానని మాటిచ్చారు. కాగా ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది.