గిరిజన గురుకులంలో మున్సిపల్ కార్పొరేషన్ డివైస్ అధికారి తనిఖీ
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025452
ఇలానే మెనూ సక్రమంగా పాటించాలని సంతృప్తి వ్యక్తం: డివైఎస్ఓ అధికారి వెంకటేశ్వర్లు
అక్షర విజేత ఆదిలాబాద్ టౌన్: అదిలాబాద్ కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ డివైస్ ఎస్ ఓ అధికారి వెంకటేశ్వర్లు మరియు బృందం గురువారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణలోని వసతి గృహం పరిసర ప్రాంతాలు డార్మెటరీ ,డైనింగ్ హాల్ ని తదితర అంశాల పైన క్షుణ్ణంగా బృందంతో పరిశీలించడం జరిగింది. విద్యార్థులతో మధ్యాహ్న భోజనం సమయంలో పిల్లలకు అందిస్తున్న అన్నము,పప్పు కోడిగుడ్లను, పెరుగు, అరటి పండ్లు, తదితర ఆహార పదార్థాలను పరిశీలించారు. ప్రిన్సిపల్ గోవర్ధన్ , ఉపాధ్యాయ సిబ్బంది బాలకృష్ణ ,సురేష్, విజయలక్ష్మి, డిప్యూటీ వార్డెన్ సుజాత మరియు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం తగు సూచనలు ఇస్తూ ఇలాగే ఎల్లప్పుడూ మెనూ సక్రమంగా పాటించాలని తగు సూచనలు ఇస్తూ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన వెంట స్టార్ ఫిఫ్టీ కోఆర్డినేటర్ మారుతి శర్మ ప్రిన్సిపల్ గోవర్ధన్ ఉపాధ్యాయులు సురేష్ బాలకృష్ణ, విశ్వనాథ్, విజయలక్ష్మి, డిప్యూటీ వార్డెన్ సుజాత విద్యార్థులు తదితరులు ఉన్నారు.