Sports & Games

Breaking News

‘దేవర’ టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి.. చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన ఎన్టీఆర్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన దేవ‌ర సినిమా సంద‌డి మ‌రో ఆరు రోజుల్లో షురూ కానున్న విష‌యం తెలిసిందే. నంద‌మూరి అభిమానుల‌తో పాటు టాలీవుడ్ ప్రేక్ష‌కులంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు ఈ సినిమా కోసం. కొరటాల శివ దర్శకత్వంలో వ‌స్తున్న ఈ భారీ పాన్‌ ఇండియా చిత్రం సెప్టెంబ‌ర్ 27న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. అయితే భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి టిక్కెట్ల రేటు పెంచడానికి ఏపీ ప్రభుత్వం అనుమతించింది.దేవ‌ర రిలీజ్ రోజు ఆరు షోల‌తో పాటు మల్టీప్లెక్స్ లో ఒక్కో టికెట్లపై రూ.135 వరకూ, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ ఒక్కో టికెట్ పై రూ.110, లోయర్ క్లాస్ ఒక్కో టికెటైపై రూ.60 వరకూ పెంచుకోవడానికి అనుమతిని ఇచ్చింది. అలాగే 28వ తేదీ నుంచి 9 రోజులపాటు రోజుకు 5 షోల చోప్పున ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది ఏపీ ప్ర‌భుత్వం. అయితే ఈ విష‌యంపై ఏపీ ప్ర‌భుత్వానికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు తార‌క్.ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబునాయుడు ఉప ముఖ్య‌మంత్రి పవన్‌కల్యాణ్‌గారికి ధన్యవాదాలు. ‘దేవర’ సినిమా విడుద‌ల నేపథ్యంలో టికెట్‌ ధరలు పెంపున‌కు, స్పెషల్‌ షోల ప్రదర్శనకు అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. తెలుగు సినిమాకు సహకారం అందిస్తున్న మీకు కృతజ్ఞతలు. సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కందుల దుర్గేశ్‌గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అంటూ తార‌క్ రాసుకోచ్చాడు