మహిళల్లో చైతన్యం కోసమే ఇందిరా ఫెలోషిప్:ఆత్రం సుగుణక్క
ఆదిలాబాద్ : మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఇందిరా ఫెలోషిప్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జీ,ఇందిరా ఫెలోషిప్ ఉమ్మడి జిల్లా యూనిట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణక్క తెలిపారు.ఇందిరా ఫెలో షిప్ ద్వారా రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ముఖ్య ఉద్దేశంగా సోమవారం మావల మండల కేంద్రంలో ఫెలోషిప్ మెంబర్స్‌కి బూట్ క్యాంప్ వర్క్ షాప్ నిర్వహించారు.ఈ సందర్బంగా సుగుణక్క మాట్లాడుతూ శక్తి అభియాన్‌లో భాగంగా ఉమెన్ ఎంప వరింగ్, ట్రాన్స్ఫార్మింగ్ పాలిటిక్స్ అనే లక్ష్యంతో ఇందిరా ఫెలోషిప్ అనే ఒక సంస్థని రాహుల్ గాంధీ ఆలోచన మేరకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.ఈ సంస్థ లక్ష్యం.. గ్రామీణ, పట్టణ, నగరాల్లో ఉన్న అన్ని వర్గాల మహిళలను ఎంపిక చేసుకుని వారికి ఇందిరా ఫెలోషిప్ పేరు మీద ఆర్థిక సహకారం అందించడం, రాజకీయాల్లో వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ముఖ్య ఉద్దేశంగా సంస్థ పనిచేస్తోందని తెలిపారు.ఈ బూట్ క్యాంప్ సమావేశాల్లో మేధావులు,వ్యాపారవేత్తలు, డాక్టర్స్, సాంకేతిక నిపుణులు, సామాజిక, రాజకీయ నేతలతో, నేటి సమాజంలో ప్రత్యేకంగా భారత రాజకీయాల్లో మహిళల పాత్ర, వాళ్ళు ఎదుర్కొంటున్న సవాళ్లు,భవిష్యత్తు రాజకీయ అవకాశాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఫెల్లోషిప్ తెలంగాణ కోఆర్డినేట్ శివలాల్ నేతికల్,స్టేట్ కోడినేటర్స్ సౌజన్య, విజేయాలక్మి, ప్రియాంక తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గిమ్మ సంతోష్, పట్టణ అధ్యక్షుడు గుడిపల్లి నగేష్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చరణ్ గౌడ్, సీనియర్ నాయకులు నవీన్ రెడ్డి,ఇంద్రాఫెల్లోస్ సభ్యులు రూప, సుమ మహిళా జిల్లా అధ్యక్షలు ఆశమ్మా, లత తదితరులు పాల్గొన్నారు.

