Sports & Games

Breaking News

వర్షాకు కాలం వ్యాధులపై అవగాహన

వర్షాకాలం దృష్ట్యా ముందస్తూ ప్రణాళికలలో బాగంగా ఈరోజు మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భీంపూర్ పరిధిలోని అన్ని గ్రామాల లో"జాతీయ కీటక జనిత ఆరోగ్య అవగాహన కార్యక్రమం"ప్రైడే,-డ్రైడే,మరియు  వైద్య శిబిరం "కామాటివాడ" గ్రామంలో నిర్వహించి 39 మందిని పరీక్షించి, జ్వరపీడితులకు ముగ్గురికి రక్తపూతలను సేకరించి మందులను అందచేయడం జరిగిందని, క్లోరినేషన్ చేసిన నీటిని,గాని కాచి చల్లార్చిన నీటిని త్రాగడానికి వినియోగం చేయాలని,వేడి,వేడి ఆహారపదార్థాలను బుజించాలని, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తి గత పరిశుభ్రత పాటించాలని,నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని,నిల్వ నీటిపై మూతలను ఉంచాలని, ఆంటి లార్వల్ రసాయనాన్ని మురికి నీటి, మంచినీటి నిల్వలపై పిచికారి చేయించడం జరిగిందని,"స్టాప్ డయోరియా " కార్యక్రమం నిర్వహించడం తో పాటు జ్వరం, నీళ్ళ విరేచనాలు వచ్చిన వెంటనే ఆశా కార్యకర్తలను, ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించి పరీక్షలు చేయించుకోని వైద్యాధికారి సూచనలతో మందులను సక్రమంగా వినియోగించుకోవాలని మండల వైద్యాధికారి డా" నిఖిల్ రాజ్, మండల ఆరోగ్య విస్తీర్ణాధికారి లింగంపల్లి జ్ఞానేశ్వర్ లు తెలిపారు, ఈకార్యక్రమంలో మండల ఆరోగ్య విస్తీర్ణాధికారి లింగంపల్లి జ్ఞానేశ్వర్, యం.యల్.హెచ్.పీలు సంధ్యారాణి, సాహితి, మాయావతి ఆరోగ్య కార్యకర్తలు కె.లచ్చుబాయ్,సరస్వతి, సుజాత, గోదావరి,భాగ్యవతి, విజయలక్ష్మి ,జానాబాయ్,నఫీజ, ఆశా కార్యకర్తలు స్వప్న ,పద్మ,కమల,రణిత,సంతోషిణి,సంగీత, శకుంతల, ఇందిర జయమాల, గౌరుబాయ్,వనిత,సునిత, గాంధారి,రోజు,రేఖ,గ్రామపంచాయతీ సిబ్బంది హాన్మంతు పాల్గొన్నారు