సాధారణ ప్రసవాలు పెంచాలి
సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి
కలెక్టర్ నారాయణరెడ్డి
ఆస్పత్రిలో అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలిస్తున్న కలెక్టర్ నారాయణరెడ్డి
నల్లగొండ,(ఆరోగ్య జ్యోతి): ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ప్రభుత్వ వైద్యులను కోరారు. శుక్ర వారం జిల్లా కేంద్రం సమీపంలోని పానగల్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని మందులు, అటెండెన్స్ రిజిస్టర్, వసతులు, ఔట్పేషెంట్, ఇన్పేషెంట్ రిజిస్టర్లు, స్టాక్ రిజిస్టర్, వార్డులను పరిశీలించారు. ఆస్పత్రి ఎదుట ఉన్న ఓపెన్ డ్రైనేజీలో వర్షాకాలంలో నీరు చేరి ఇబ్బంది కలుగుతున్నదని స్థాని కులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వెంటనే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఆస్పత్రిలో చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలని సూచించారు. ఆస్పత్రికి వచ్చిన గర్భిణులతో మాట్లాడుతూ వైద్య సేవలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. జాగ్రత్తగా మందులు వాడాలని, పౌష్ఠికాహా రం తీసుకోవాలని సూచించారు. వైద్యులతో మాట్లాడుతూ, సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని, ప్రతీ గర్భిణి ఆస్పత్రి రికార్డుల్లో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో రెండు రోజులుగా ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టామని, ఆస్పత్రి పరిసరాల్లో సైతం చెత్తాచెదారాన్ని తీసివేసి, పిచ్చి మొక్కలను తొలగించాలని ఆదేశించారు. ఆయ న వెంట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇన్చార్జి అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డిప్యూటీ డీఎంహెచ్వి వేణుగోపాల్రెడ్డి, ఆస్పత్రి వైద్యాధికారి రూపిక, కోఆర్డినే టర్ భిక్షం తదితరులు ఉన్నారు. అదేవిధంగా ట్రాన్స్ జెండర్ స్వయం ఉపాధి శిక్షణ ముగించుకున్న 26 మందికి కలెక్టర్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వయం ఉపాధి నైపుణ్యాలను, శిక్షణ అవకాశా లను పెంపొందించడం కోసం హైదరాబాద్కు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ హాస్పటల్ మేనేజ్మెంట్ సహకారంతో ప్రభుత్వం సుమారు రూ.10లక్షలు వెచ్చించి శిక్షణ ఇప్పించిందన్నారు. సమాజంలో లింగ వివక్షను పోగొట్టడం, వీరికి సమాన అవకాశాలు కల్పించడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోం దన్నారు. ప్రభుత్వ శాఖల సమన్వయంతో ట్రాన్స్ జెండర్లు, దివ్యాంగులకు మెరు గైన ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధి కారి సక్కుబాయి, అదనపు అధికారి వేణు, మునగాల నాగిరెడ్డి, ట్రాన్స్ జెండర్ నందిని, తనుశ్రీ, సితార, తదితరులు పాల్గొన్నారు.