Sports & Games

Breaking News

త్రిపుర విద్యార్థులపై హెచ్ఐవి పంజా..?828 హెచ్ఐవి పాజిటివ్..?47 మంది విద్యార్థులు మృతి?

అగర్తల, జూలై 6: త్రిపురలో విద్యార్థులపై హెచ్‌ఐవీ వ్యాధి తీవ్ర ప్రభావం చూపుతున్నది. గత కొన్ని నెలల కాలం లో వందలాది మంది ఈ మహమ్మారి బారిన పడగా, ఇంతవరకు 47 మంది విద్యార్థులు మరణించారు. త్రిపుర ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ (టీఎస్‌ఏసీఎస్‌) వివరాల ప్రకారం రాష్ట్రంలో ఇప్పటివరకు 828 మంది విద్యార్థులకు ఈ వ్యాధి సోకింది.ఈ వ్యాధి తీవ్రత వల్ల 47 మంది మరణించారు. ఉన్నత చదువుల కోసం త్రిపురకు చెందిన పలువురు విద్యార్థులు దేశంలోని పలు ప్రాంతాలకు వెళ్తుంటారు. దీంతో దేశంలోని ఇతర ప్రాంత విద్యార్థులకు ఈ వ్యాధి సోకే అవకాశముందని భావిస్తున్నారు