Sports & Games

Breaking News

జులై 8న వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల సందర్భంగా వైద్య శిబిరాలు

తెలంగాణ బ్యూరో (ఆరోగ్య జ్యోతి): గ్రామీణ గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో పేద బడుగు బలహీన నిరుపేద వర్గాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ వారి ప్రాణాలను డే ఆర్ ఎం పి పింపులను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత. యేడుగురి నందింటి రాజశేఖర్ రెడ్డి  జులై 08.1949 75వ జయంతి ను పురస్కరించుకుని ఈ నెల జులై 8న సోమవారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించనున్నట్లు తెలంగాణ కమ్యూనిటీ పారామెడిక్ వైద్యుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ ఉక్కుల, ప్రధాన కార్యదర్శి బి.నవీన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఆర్ఎంపి, పిఎంపి  ల సేవలను గుర్తించి వారికి అండగా నిలిచి వారి ప్రభుత్వ హయాంలో 2014 జీవో నం.1273 ప్రకారం కమ్యూనిటీ పారామెడిక్ శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి ఆర్ఎంపి, పిఎంపి ల కుటుంబాలకు బతుకు భరోసా కల్పించిన మహానీయుడని వారు పేర్కొన్నారు. అందరి నేత, జనహృదయ నాయకుడు మాజీ సీఎం దివంగత డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి కి జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా  భారీ ఎత్తున ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ, సేవ కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్రకమిటీ పిలుపునీ ఇచ్చారు. అందులో భాగంగానే... పేద ప్రజలకు నిత్యావసర సరుకులు, దుస్తులు మరియు రక్తదానం, ఉచిత వైద్యం శిబిరాలు, పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడం, అనాధ ఆశ్రమంలో పండ్లు ఫలాలు మరియు వస్త్రాలుపంపిణీ చేయాలని నిర్ణయించడం జరిగింది. అన్ని "సంఘాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా" ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని, ప్రజల మన్ననలు పొందాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల, మండలాల గ్రామాల్లో ఉన్న ప్రతి ఆర్ఎంపి, పిఎంపి  వారి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ప్రతి ఆర్ఎంపి, పిఎంపి  వైద్యుడికి పిలుపునివ్వడం జరిగింది.