Sports & Games

Breaking News

రూ.10 లక్షలకు పెరగనున్నఆయుష్మాన్ ఆరోగ్య బీమా

 దిల్లీ: ప్రతిష్ఠాత్మక ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య
బీమా పథకాన్ని రూ.10 లక్షలకు పెంచే యోచ నలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు రాబోయే మూడేళ్లలో ఈ పథకం కింద లబ్ధిపొందేవారి సంఖ్యను సైతం రెండితలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. తొలుత 70 ఏళ్లు పైబడిన వారిని ఈ పథకంలో భాగం చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ అధికారులు వెల్లడిం చారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపితే ఏటా ఖజానాపై మరో రూ.12,076 కోట్ల భారం పడనుందని, దేశంలో మూడింట రెండొం తుల మందికి ఆరోగ్య బీమా వర్తించనుందనిఅంచనా వేస్తున్నారు. ఈ ప్రతిపాదనలన్నీ లేదా వీటిలో కొన్నింటిని రాబోయే కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమా చారం. ఆయుష్మాన్ భారత్ యోజనను 70 ఏళ్లు పైబడిన వారికి సైతం విస్తరిస్తున్నట్లు జూన్ 27న జరిగిన పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మరో 4-5 కోట్ల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. దేశంలో ఎటువంటి ప్రయోజనాలు పొందని 30శాతం మందిని సైతం ఈ బీమా పరిధిలోకి తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని అధికారిక వర్గాలు తెలిపాయి.