వడదెబ్బ నుంచి రక్షించుకుందాం గోడప ప్రతుల విడుదల
వడదెబ్బ నుండి రక్షించుకుందాం గోడ ప్రతుల ఆవిష్కరణ
• జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
నిజామాబాద్ (ఆరోగ్యజ్యోతి): వడదెబ్బ నుండి రక్షించుకుందాం అనే గోడ ప్రతులను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం సుదర్శన్లు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు వేటిగాలులు వేడి వాతావరణం పెరుగుతుందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు సూపర్వైజర్లు ఇతర సిబ్బంది అంతా కలిసి ప్రజలకు వడదెబ్బపై అవగాహన సదస్సులు నిర్వహిస్తూ అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ప్రతిరోజు గ్రామాల్లో పట్టణాల్లో గృహాలను సందర్శించి ఇంటింటికి తిరుగుతూ వడదెబ్బ వల్ల కలిగే అనార్థాల గురించి వివరించాలని ఆయన సూచించారు .ముఖ్యంగా ఎండలో పనిచేసే సాధారణ ప్రజలు గ్రామీణ ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు .అవసరం ఉంటే మాత్రం బయటకు వెళ్లాలని లేనిపక్షంలో వెళ్ళవద్దని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు .అనంతరం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం సుదర్శనం మాట్లాడుతూ వడదెబ్బ తగలడం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోయే పరిస్థితి ఉందని తెలిపారు. వడదెబ్బ తగిలిన వెంటనే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని తెలిపారు.వడదెబ్బ తగిలిందంటే దగ్గర్లోని ఆశా కార్యకర్త ఆరోగ్య కార్యకర్త వద్ద వెళ్లి అన్ని రకాల వైద్యం తీసుకోవాలని తెలిపారు వడదెబ్బ తగలడం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. వడదెబ్బ తగిలిన వారు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం సుదర్శన్ సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ డాక్టర్ శివశంకర్, ఏవో చందర్, జిల్లా మాస్ మీడియా అధికారి బి గంగాధర్, నాగరా,జు సందీప్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
వడదెబ్బ తగిలితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఓఆర్ఎస్ ద్రావణాన్ని ఉపయోగించాలి. మరియు నిమ్మరసం మజ్జిగ పండ్ల రసాలు వంటింట్లో తయారు చేసిన పానీయాలను కొద్దిగా ఉప్పు కలిపి త్రాగాలి.
*పుచ్చకాయ కర్బూజా ఆరెంజ్, ద్రాక్ష పైనాపిల్ దోసకాయ ,కొబ్బరి బొండం, వంటి అధిక నీటి పరిమాణం కలిగి ఉన్న సీజనల్ పండ్లు మరియు కూరగాయలను తినాలన్నారు.
*సన్నని వదులుగా లేత రంగులో ఉండే కాటన్ వస్త్రాలను ధరించడం మంచిదని తెలియజేశారు.
*ప్రజలంతాఅప్రమత్తంగా ఉంటూ వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలన్నారు.
వడదెబ్బ లక్షణాలు పెద్దలలో
*అయోమయం గందరగోళం మరియు ఆందోళన చిరాకు అటాసియా మోర్చా లేదా కోమా.
*వేడి ఎరుపు మరియు పొడి చర్మం శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువగా మారడం.
*తలనొప్పి మైకము మరియు మూర్చ.
*కండరాల బలహీనత లేదా తిమ్మిరి వికారం మరియు వాంతులు.
*హృదయ స్పందన పెరగడం లేదా శ్వాస పెరగడం.
చిన్నపిల్లల్లో వడదెబ్బ లక్షణాలు
*ఆకలి లేకపోవడం, విపరీతమైన చిరాకు.
*మూత్ర విసర్జన తగ్గడం.
*పొడి నోటీసులేష్మం మరియు కన్నీరు గుంతలు పడిన కళ్ళు.
*మగత/ మతిస్థిమితం లేకపోవడం ,మూర్ఛ.
*ఏదైనా భాగం నుండి రక్తస్రావం.
ఇతర జాగ్రత్తలు మరియు సూచనలు
*మీ దగ్గరలోని ఆశా కార్యకర్తను లేదా ఏఎన్ఎం ను సంప్రదించండి.
*మీ మీ దగ్గరలోని ఆరోగ్య ఉప కేంద్రాన్ని లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి.
*అధిక శరీర ఉష్ణోగ్రత, అపస్మారక స్థితి, గందరగోళం, చెమటలు పెట్టకపోవడం, ఎవరిలోనైనా కనిపిస్తే 108 కి కాల్ చేయండి అని తెలియజేశారు.