ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451, 9848289499
- వంట గదిలో పరిశుభ్రత పాటించండి
- టాస్క్ఫోర్స్ టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు మరియు డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్
ఆదిలాబాద్ రిమ్స్,(ఆరోగ్య జ్యోతి): రిమ్స్ ఆసుపత్రిలో జైన్ అయిన రోగులకు సరైన ఆహారం సక్రమంగా అందించాలని రీమ్స్ సిబ్బందికి టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ సూచించారు. బుధవారం రోజు రిమ్స్ ఆసుపత్రి పరిధిలోని వంటగదిని ఆయన పరిశీలించారు. రోగులకు ఇచ్చే ఆహారం గురించి అడిగి సూపర్వైజర్ రజిని ని తెలుసుకున్నారు. ఉదయం ఎలాంటి టిఫిన్ పాలు ఇస్తున్నారూ ..అని అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం రాత్రి ఎలాంటి ఆహారం ఇస్తున్నారు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంట ఆచారిని పిలిసి ఎలాంటి వస్తువులు వాడుతున్నారు. రోగులకు ఎలాంటి వంటలు చేస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు. స్టోర్ రూమ్ పరిశీలించారు స్టోర్ రూమ్ లో ఉన్న వస్తువులను మెస్ మెస్ సూపర్వైజర్ రజిని అడిగి తెలుసుకున్నారు. రోగులకు నాణ్యమైన వంట సరుకు తీసుకువచ్చి వంట చేయాలని మెస్ సూపర్వైజర్ రజనికి సూచించారు. అనంతరం వైద్యులకు ఎలాంటి ఆహారం ఇస్తున్నారు ఆదివారం రోజు తప్పనిసరిగా చికెన్ లేదా మటన్ బిర్యానీ ఇవ్వాలని తెలిపారు. రోగులకు అందించే గుడ్లు వారం వారం మెనూ ప్రకారం ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆరోగ్యశ్రీ అందించే ఆహారం గురించి అడిగి తెలుసుకున్నారు.
భోజనం క్వాలిటీ గా ఉండడంతో పాటు నాణ్యత పరిమాణాలు పాటించాలని లేకపోతే చర్యలు తప్పవని మేస్ సూపర్వైజర్ రజనీకి టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం చాటు ప్రకారం వారం వారం ఏ ఏ వంటలు ఉండాలని ప్రభుత్వం మెస్ యజమానులకు ఇచ్చారని తెలిపారు. ఎలాంటి అవకతవకలు లేకుండా మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని తెలిపారు. ఆయన వెంట రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ మరియు సుపరిండెంట్ డాక్టర్ జయసింగ్ రాథోడ్, ఆర్ ఎం ఓ సాయి, మిస్ సూపర్వైజర్ రజిని, రవీందర్, నిఖిల్ తదితరులు ఉన్నారు.