- ఎంఎల్ఏ జాదవ్ అనిల్
నేరేడుగోండ,(ఆరోగ్య జ్యోతి): క్షయ వ్యాధిపై ప్రజలకు మరింత అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని ఎంఎల్ఏ జాదవ్ అనిల్ అన్నారు. సోమవారం రోజు ఆయన క్షయ కు సంబంధించిన పాంప్లెట్లు, పోస్టర్లు, కిట్ ల బోత్ శాసనసభ్యులు జదవ్ అనిల్, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సుమలత లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఎల్ఏ అనిల్ మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులు ఎక్కువగా ఉన్నారని గ్రామీణ ప్రాంతాలు కూడా ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. చాలామంది పేదలకు ఆహారం లో సరైన విటమిన్స్ లేక అనేక రకాల జబ్బున బారిన పడుతున్నారని తెలిపారు.
క్షయ వ్యాధిపై అవగాహన కల్పించవలసిన అవసరం ఉందన్నారు. క్షయ వ్యాధి వచ్చిందని భయపడవలసిన అవసరం లేదని తెలిపారు కొత్తగా మూడు నుంచి ఆరు నెలలు చికిత్సలు తీసుకున్నట్లయితే క్షయ తగ్గుముఖం పట్టడంతో పాటు వ్యాధి వ్యాపించిన వ్యక్తి బలంగా తయారవుతారని తెలిపారు. క్రమం తప్పకుండా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది చెప్పిన విధంగా మందులు వాడినట్లయితే వ్యాధి తగ్గుముఖం పడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. క్షయ వ్యాధిపై జిల్లా వ్యాప్తంగా 100 రోజులపాటు క్షయ పరీక్షలు నిర్వహించడం జరిగిందని జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సుమలత తెలిపారు. క్షయ వ్యాధిపై ప్రచారం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. క్షయ వ్యాధి లక్షణాలు కనిపిస్తే భయం పడకుండా నిర్భయంగా దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి లేదా రిమ్స్ ఆస్పత్రికి లేదా రిమ్స్ ఆస్పత్రి ఆవరణలో ఉన్న జిల్లా టీబి నివారణ అధికారి కార్యాలయంలోని ఆసుపత్రికి వచ్చినట్లయితే ఉచితంగా వైద్య పరీక్షల నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఒకవేళ క్షయ అని తెలిసిన వెంటనే సిబ్బంది మందులు అందజేస్తారని క్రమం తప్పకుండా మందులు తీసుకున్నట్లయితే 3 నుంచి 6 నెలల్లోపు వ్యాధి తగ్గుముఖం పడుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోఎస్ టి ఎస్ లు సుధా దేవి దాస్ హెచ్ ఈ ఓ పవర్ రవీందర్ తదితరులు ఉన్నారు.