పిల్లలకు క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించాలి
April 19, 2025
అంగడి రాయచూరు, (ఆరోగ్య జ్యోతి): పిల్లలకు క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించాలని అంగడి రాయచూరు ఆరోగ్య కార్యకర్త జయమాల అన్నారు. అంగడి రాయచూరు సబ్ సెంటర్ లో వ్యాధి నిరోధక టీ కల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అప్పుడు పుట్టిన పిల్లలనుండి ప్రతి ఒక్కరికి క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించాలని తెలిపారు. సబ్ సెంటర్ తో పాటు అనుబంధ గ్రామాల్లో ప్రతి బుధ మరియు శనివారాల్లో పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. సబ్ సెంటర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు పెద్ద ఆస్పత్రుల్లో ప్రతిష్ని బుధవారాల్లో వ్యాధి నిరోధక టీకాలు ఇచ్చే కార్యక్రమం ఉంటుందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంతోష, అరుణ, లాలమ్మ, చంద్రకళ, టీ భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.