తెలంగాణ బ్యూరో, (ఆరోగ్య జ్యోతి): గవర్నమెంట్ రికగ్నైసేడ్ తెలంగాణ నర్సెస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం ఎంపిక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవన్ కోటి, హైదరాబాద్ లో ఎంపిక జరిగింది ఈ ఎంపికల్లో స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రెటరీగా రాపోలు శేఖర్ ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా విషెడోమ్ చౌదరి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ చేతుల మీదుగా ప్రశంస అందుకోవడం జరిగి. నర్సింగ్ ఆఫీసర్రా పోలు శేఖర్ 2005 నుంచి ఇప్పటివరకు నర్సింగ్ ఉద్యోగుల కోసం కోర్సు పూర్తి చేసిన వారి కోసం అనేక రకాల పోరాటాలు చేసి నా ఆయనకు స్టేట్ ఆర్గనైజ్జేషన్ సెక్రటరీగా ఎంపిక చేశారు.మేల్ నర్సింగ్ అడ్మిషన్స్ కోసం ఎన్టీఆర్ యూనివర్సిటీలో పోరాటం చేసి, అంతేకాకుండా హైకోర్టులో కేసు వేసి గెలిచి 99 మంది BSc Nursing అడ్మిషన్స్ ఇప్పించడం జరిగింది. అంతేకాదు 2007లో Junior Nursing Association (JNA) పెట్టిఎంతో మందికి నర్సింగ్ వాళ్లను ఏకతాటిపై తీసుకురావడానికి తన వంతుగా ఎంతో కృషిచేసి జెఏసిని ఏకతాటిపై తీసుకువచ్చిన ఘనత ఆయనదే. యూనివర్సిటీ పై అలుపెరుగని పోరాటం చేయడం జరిగింది. గత ప్రభుత్వం తీసుకువచ్చిన 317 GO. పై మొదటి నుంచి తాను కష్టపడుతూ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి 317 జీవోపై ఎన్నోసార్లు విమరణ అందించడంతోపాటు సభలు సమావేశాలు పెడుతూ 30017 జీవో బాధితులను ఏకతాటిపై తీసుకువచ్చి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయడం కోసం తను ఎంతగానో కృషి చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వానికి.
లీగల్ గా కోర్టులో కూడా కేసులు వేయడం జరిగింది సెక్రటేరియట్ ముట్టడి చేయడం, (29.12.2023), ప్రజా పాలన వద్ద కూడా వెళ్లడం, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కోటి దగ్గర కూడా ధర్నా చేయడం జరిగింది,
హెల్త్ మినిస్టర్ని మరియు సెక్రటేరియట్ అధికారులని ఎన్నోసార్లు కలవడం జరిగింది.
అంతేకాకుండా ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్లడం లో అందవేసిన చేయి.ఈ సందర్భంగా నూతనంగా గవర్నర్ రికగ్నైజ్జుడు తెలంగాణ నర్సస్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీగా ఎంపికైన రాపోలు శేఖర్ మాట్లాడుతూ ఇప్పటివరకు నర్సస్ కు సంబంధించిన అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయడం జరిగిందని తెలిపారు తనపై ఉంచిన ఈ బాధ్యతను దృష్టిలో పెట్టుకొని మరింత సేవలను మెరుగుపరిచేందుకు తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలు చేపడుతూ నర్సస్ కు అన్యాయం జరిగిన వెంటనే తను న్యాయం పోరాటానికి దిగుతానని చెప్పారు. ఇందుకుగాను ప్రతి ఒక్కరు తనకు సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.