*మాదకద్రవ్యాల వినియోగం, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ చేయడం చట్ట వ్యతిరేకం.*
*రిమ్స్ కళాశాల నందు విద్యార్థులతో ర్యాగింగ్, డ్రగ్స్, మాదకద్రవ్యాలు, ఈవ్ టీజింగ్ లపై అవగాహన కార్యక్రమం.*
*ఆదిలాబాద్ జిల్లా ను గంజాయి రహిత జిల్లాగా ఏర్పాటుకు కృషి
*చదువుతున్న వైద్య విద్యార్థులు ఆదిలాబాద్ కీర్తి ప్రతిష్టలు పెంపొందించాలా ఎదగాలని ఆకాంక్ష.*
*జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.*
ఆదిలాబాద్ జిల్లా నందు ముఖ్యమైన ప్రభుత్వ ఆసుపత్రి రిమ్స్ కళాశాల నందు చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులతో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వైద్య విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి ఆదిలాబాద్ జిల్లా కీర్తి ప్రతిష్టలను పెంపొందించే విధంగా ఉండాలని ఆకాంక్షించారు. అదేవిధంగా వైద్య విద్యార్థులలో ర్యాగింగ్ నిర్వహించడం చట్ట వ్యతిరేకమని, ర్యా గింగ్ చేయడం వల్ల సున్నిత మనస్తత్వం కలవారు దేశంలో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ర్యాగింగ్ ను ప్రోత్సహించకుండా ఉండాలని తెలిపారు. ర్యాగింగ్ పై ఎలాంటి ఫిర్యాదులు వచ్చిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. అదేవిధంగా వైద్య విద్యార్థులు డ్రగ్స్ కు గంజాయి లాంటి పదార్థాలకు అలవాటు కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆధునిక భారతదేశ అభివృద్ధి వైపు పయనించాలంటే మీలాంటి విద్యావంతులు ఎంతగానో దోహదపడతారని గుర్తు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మాదకద్రవ్యాలను సేవించకుండా వినియోగించకుండా ఉండాలని తెలియజేశారు. అదేవిధంగా ఈవిటీజింగ్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మహిళలకు ఎలాంటి అత్యవసర సమయంలోనైనా ఆదిలాబాద్ షీ టీం బృందం అందుబాటులో ఉంటూ సరైన సేవలను అందజేస్తుందని హామీ ఇచ్చారు. మహిళలు విద్యార్థినిలు ఎలాంటి అవసరం ఉన్న ఆదిలాబాద్ షీ టీం బృందాన్ని సంప్రదించాలని తెలిపారు. ఈవిటీజింగ్ పై, ర్యాగింగ్ పై, మాదకద్రవ్యాల బారిన పడి విద్యార్థులు జీవితాలను కోల్పోయిన సంఘటనలు, విద్యార్థులకు గతంలో జరిగిన సంఘటనలను ఉదాహరణలుగా తెలియజేస్తూ చైతన్య పరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, రెండో పట్టణ ఇన్స్పెక్టర్ సిహెచ్ కరుణాకర రావు, కళాశాల డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, కళాశాల అధ్యాపకులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.