తెలంగాణ బ్యూరో, (ఆరోగ్య జ్యోతి): తెలంగాణ రాష్ట్రంలోని ఆయుష్ శాఖలో మార్చి 28న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 65 ను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ఆయుష్ ఫార్మసిస్ట్ కాంపౌండర్ అసోసియేషన్ (ఎన్ హెచ్ ఎం)రాష్ట్ర నాయకులు అసోసియేషన్ నాయకులు రంజిత్ , శంకర్, శ్రీకాంత్, జ్యోతి, సుశీల
ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత నెల మార్చ్ 28 వ తేదిన విడుదల చేసిన జి. ఓ నెంబర్ 65 ను రద్దు చేయాలని , ఇది ఆయుష్ సర్వీస్ రూల్స్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ఆయుష్ ఫార్మసిస్ట్ (కంపౌండర్) ల రాష్ట్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు రంజిత్ ప్రభుత్వాన్ని కోరినారు.2005 వ సంవత్సరం నుండి పని చేస్తున్న 62 మంది ఉద్యోగుల్ని వెంటనే తొలగించాలని ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే మార్చుకోవాలని ఆయన కోరారు.ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం లో 2005 వ సంవత్సరం నుండి 62 మంది ఆయుష్ కంపౌండర్స్, కాంట్రాక్టు ప్రాతిపదికన అప్పటి కంపౌండర్ సర్వీస్ రూల్స్ అనుగుణంగా 10 వ తరగతి అర్హతతో, ఆ తర్వాత సవరించిన ఇంటర్మీడియట్ విద్యార్హత తో ఆయుష్ కంపౌండర్ సాంక్షన్డ్ పోస్ట్స్ లలో, ట్రెజరీ ద్వారా వేతనాలు పొందుతూ 1 సంవత్సరం ఇన్ సర్వీస్ ట్రైనింగ్ (ఆయుర్వేద/ హోమియో / యునాని ) పొందిన సర్టిఫికెట్ తో గత 20 సంవత్సరాల నుండి ఆయుష్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నారనీ వీరందరిని యధావిధిగా విధుల్లో ఉంచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అంతేకాకుండా 2017 వ సంవత్సరం లో అంతకు ముందు ఉన్న ఉద్యోగ అర్హత లని సవరిస్తూ కంపౌండ ర్ అనే పేరు ను ఫార్మసిస్ట్ గా మారుస్తూ ఇక పై జరిగే ఆయుష్ ఫార్మసిస్ట్ పోస్ట్ కి విద్యార్హత గా 2 సంవత్సరాల ఆయుష్ డిప్లొమా పార్మసీ కోర్స్ (ఆయుర్వేద/ హోమియో / యునాని ) అని నిర్ణయించి జి.ఓ నెంబర్ 147 ని విడుదల చేసిందనీ తెలిపారు.కానీ ఆ ఆయుష్ డిప్లొమా కోర్స్ ని 2017 నుండి 2025 వరకు ఎక్కడ అటువంటి కోర్స్ ని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కానీ, ప్రస్తుత తెలంగాణ లో ని ఏ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో అటు వంటి కోర్స్ ని ప్రవేశ పెట్టలేదు . ఎన్నో సార్లు ప్రభుత్వాన్ని కోర్స్ ప్రవేశ పెట్టండి అని రెప్రెసెంటేషన్స్ ద్వారా అడిగినా కూడ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పుడు జాబ్ క్యాలెండరు ప్రకారం ఆయుష్ ఫార్మసిస్ట్ 308 పో పోస్ట్స్ ని అల్లోపతి లో 2 సంవత్సరాల డిప్లొమా (D. ఫార్మసీ / B పార్మసి / పార్మా D) చేసిన అభ్యర్ధు లని మాత్రమే అర్హులు గా చేస్తూ జి. ఓ నో 65 ని విడుదల చేసి వాళ్లకి సర్వీస్ లో కి వచ్చిన తరువాత ఆయుష్ డ్రగ్స్ పై 6 నెలల ట్రైనింగ్ ఇస్తామని తెలిపింది.NCISM (National Commission for Indian System of Medicine) 5
సిస్టం లోకి అల్లోపతి వాళ్ళని అర్హులుగా చేస్తూ ప్రభుత్వం అసంబద్ధ నిర్ణయం తీసుకోవడం వలన గత 20 సంవత్సరాలుగా కాంట్రాక్టు ఉద్యోగం లో పని చేస్తున్న 62 మంది ఆయుష్ కంపౌండర్ (ఫార్మసిస్ట్) వెంటనే ఉద్యోగాన్ని కోల్పోతూ వారి కుటుంబాలు 20 వ సంవత్సరాల సర్వీస్ తరువాత రోడ్డున పడే పరిస్థితిని ప్రభుత్వం తీసుకువచ్చింది. కనీసం నోటిఫికేషన్ ద్వారా జరిపే పరీక్ష కి కూడా అర్హత కోల్పోవాల్సి వచ్చింది.అదే విధముగా NHM SCHEME లో కాంట్రాక్టు పద్ధతి లో 2008 నుండి 2025 వ సంవత్సరం వరకు గత 18 సంవత్సరాల నుండి పని చేస్తున్న 275 మంది ఆయుష్ ఫార్మనిస్ట్ (కంపౌండర్) లు 308 రెగ్యులర్ ఆయుష్ ఫార్మసిస్ట్ DIRECT RECRUITMENT నోటిఫికేషన్ కి అర్హులు కాకుండా, సర్వీస్ వెయిట్ ఏజ్ 20 MARKS కూడా అర్హత కోల్పోయి జీవితాంతం కాంట్రాక్టు ఉద్యోగి గానే కొనసాగెల వాళ్ళ భవిష్యతు ప్రశ్నార్ధకంగా మారిందనీ ఆయన పేర్కొన్నారు.ఇలా 337 మంది పొట్ట కొడుతూ, ఆయుష్ వైద్య విధానం, అల్లోపతిక్ విధానం వేరు వేరు గా ఉన్నప్పటికీ, దేశం లో ఏ ఇతర రాష్ట్రమ్ లో లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లో ఆయుష్ లోకి అల్లోపతి ని ప్రవేశ పెడుతూ 337 కుటుంబాలని రోడ్డున పడేసేలా తీసుకున్న ఈ నిర్ణయాన్ని పున: పరిశీలించాలని ఆజి.ఓ 65 ని వెంటనే రద్దు కానీ, సవరణ కాని చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితిని ప్రభుత్వం కల్పించిందని కాంట్రాక్టు ఆయుష్ ఉద్యోగులు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆయుష్ శాఖలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. గత కొన్నిల్లుగా ఆయుష్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీలో పెట్టుకొని జీవోను రద్దు చేయడంతో పాటు రాబోయే రోజుల్లో ఆయుష్ విభాగంలో పోస్ట్లు పెంచాలని ఉన్న పోస్టులను యధావిధిగా కొనసాగించాలని అధ్యక్షులు రంజిత్ ప్రభుత్వాన్ని కోరారు.