*ధ్యానం ఒక మానసిక సత్ప్రవర్తన
వరంగల్,(ఆరోగ్య జ్యోతి):ధ్యానం ఒక మానసిక ప్రవర్తన అని అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్.ఎం.యశస్విని అన్నారు. వరంగల్ జిల్లా పాపాయిపేటలో డిసెంబర్ 21 ప్రపంచ మొదటి యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని సూపర్వైజర్ నర్మద వారి ఆధ్వర్యంలో యోగ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వైద్యాధికారి డాక్టర్. యశస్విని మాట్లాడుతూ యోగ సాధకుడు ప్రతీకార, యోచన బుద్ధి నుంచి అమితమైన విశ్రాంతి, స్పృహను పొందడమే ధ్యానం అంటారు. యోగ పురాతన కాలం నుంచి సాధన చేస్తున్నారు. అలాగే దీనిని మత సంప్రదాయాలకతీతంగా కూడా సాధన చేస్తున్నారని, విస్తృత శ్రేణి ఆధ్యా త్మిక, మన స్తత్వభౌతిక సాధనలు విభిన్నధ్యాన సత్ప్రవర్తనలుగా ఉంటాయన్నారు. వీటి ద్వారా అత్యుత్తమ చైతన్య స్థితిని పొందడం మొదలుకొని అత్యధిక ఏకాగ్రత, సృజనాత్మకత, సాధారణంగా ఒక విశ్రాంత, ప్రశాంతమైన మనస్సును పొందడం వంటి లక్ష్యాలను సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు సోనీ, రాణి , అనిత మరియు తదితరులు పాల్గొన్నారు.