లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తప్పవు
December 21, 2024
అదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): లింగ నిర్ధారణ, పిసీ అండ్ పిఎన్డిటి ఆక్ట్ (గర్భస్థ లింగ నిర్ధారణ చట్టరీత్య నేరం) లో భాగంగా జిల్లా స్థాయి బహుళ సభ్యుల సముచిత అధికార కమిటి లింగ నిర్ధారణ చట్టం పై శనివారం జిల్లా పాలనాధికారి ఛాంబర్ లో జిల్లా ప్రధాన న్యాయవాది ప్రభాకర్, జిల్లా పాలనాధికారి రాజర్షి షా, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, జిల్లా లీగల్ అధారిటీ సౌజన్య ఆద్వర్యం లో సమావేశం నిర్వహించారు.జిల్లాలోని ఆసుపత్రులు, అల్ట్రా సౌండ్ స్కానింగ్ కేంద్రాలలో లింగ నిర్ధారణ పరీక్షల పై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు .ఈ సమావేశం లో జిల్లా సరిహద్దులో మహారాష్ట్ర కు దగ్గరగా ఉన్న మండలంలో సెక్స్ రేషియో తక్కువగా ఉన్న ప్రాంతాలలో విజిలెన్స్ ఏర్పాటు తో పాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని చర్చించడం జరిగింది.అన్ని స్కానింగ్ కేంద్రాలలో వచ్చే రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు నవీకరించాలని, ఎలాంటి పొరపాట్లు జరిగినా, ఆ స్కానింగ్ కేంద్రం పై పోలీస్ శాఖ సహకారం తో చర్యలు తీసుకోవడం జరుగుతుందనీ ఆన్నారు.జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి పిసి అండ్ పిఎన్డిటి ఆక్ట్ ప్రకారం తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఆస్పత్రులు, అల్ట్రా సౌండ్ స్కానింగ్ కేంద్రాలలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు తెలిస్తే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి దృష్టికి తీసుకు రావాలని తెలిపారు .జిల్లాలోని అన్ని స్కానింగ్ సెంటర్ల పనితీరును, తనిఖీ పర్యవేక్షించుటకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, అన్ని ప్రభుత్వ కళాశాలలో లింగ నిష్పత్తి, లింగ వివక్షత పై అవగాహన సదస్సులు ప్రణాళిక ప్రకారంగా నిర్వహించాలన్నారు. స్కానింగ్ సెంటర్ల లో తనఖీ సమయంలో నిర్దిష్ట ప్రశ్నావళి వంద మార్కులకు తయారుచేసి గ్రేడింగ్ విధానం అమలు చేయాలని అన్నారు. అనంతరం క్లినికల్ ఎస్టాబ్లిషమెంట్ యాక్ట్ ప్రకారం ఈ రోజు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ మీటింగ్ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఛాంబర్ లో జరిగింది. 1) జిల్లా కలెక్టర్, 2) జిల్లా ఎస్పీ 3) IMA ప్రెసిడెంట్, 4) జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.దీనిలో బాగంగా జిల్లాలోని అన్ని ఆసుపత్రులు, ల్యాబ్ లు, ఆయుష్ క్లీనిక్, క్లినికల్ ఎస్టాబ్లిషమెంట్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకొవాలని, ఈ క్రింది నియమ నిబంధనలు పాటించాలి.
1) అర్హత కలిగిన సిబ్బందిని నియమించుకోవాలి
2) ధరల పట్టిక పెట్టాలి.
3) కనీస IEC ప్రదర్శించాలి.
4) సంక్రమిత వ్యాధుల గురించి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారికి తెలియపర్చాలి.
5) హాస్పిటల్ , క్లీనిక్, రిజిస్టర్స్ తప్పకుండా రాయాలి.
6) రిజిస్ట్రేషన్ లేని హాస్పిటల్స్, క్లీనిక్ పై చర్యలు తీసుకోవాలి.
7) ప్రతి ఆసుపత్రి తప్పకుండ ఫైర్ సేఫ్టీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, బయో-మెడికల్ వెస్టెజ్ సర్టిఫికెట్ తీసుకోవాలి(permission)
ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి నరేందర్, డిప్యూటి DMHO సాదన, తదితరులు పాల్గొన్నారు.