వరంగల్, (ఆరోగ్య జ్యోతి):జిల్లా వైద్య ఆరోగ్యశాఖ జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వరంగల్ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుండి ప్రభుత్వ కాకతీయ మెడికల్ కాలేజ్ వరకు కొవ్వొత్తులు వెలిగించి అవగాహన ర్యాలీ అనంతరం సంఘీభావ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డీ ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్.బీ. సాంబశివరావు మాట్లాడుతూ ఎయిడ్స్ తో మరణించిన వారిని స్మరించుకుంటూ, ప్రజలలో హెచ్.ఐ.వి , ఎయిడ్స్ పట్ల అవగాహన కలిగించడం ,అలాగే ఎవరైతే హెచ్.ఐ.వి. వ్యాధితో జీవిస్తున్నారో వారికి , వారి కుటుంబ సభ్యులకు సంఘీభావంగా సపోర్టుగా ఉండేందుకు, కోసం ఈ కార్యక్రమం 1983 నుండి నిర్వహిస్తున్నామన్నారు. హెచ్ఐవి అవగాహన,నియంత్రణలో,పునరావాసం లో ప్రభుత్వ విభాగాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నారని అన్నారు. విద్యార్థి దశ నుండి ప్రతి ఒక్కరు హెచ్.ఐ.వి, ఎయిడ్స్ ,పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. క్షేత్రస్థాయిలో అవగాహన కలిగిస్తూ స్క్రీనింగ్ శాతాన్ని పెంచాలని, హెచ్ఐవి నిర్ధారణ అయినవారు ఎఆర్టి మందులు క్రమం తప్పకుండా వాడాలని వారికి ఫాలోఅప్ సేవలు అందించాలని సూచించారు.డాక్టర్.ఆచార్య మాట్లాడుతూ సి కె ఎం ప్రసూతి ఆస్పత్రి ,టీబీ ఆసుపత్రి మరియు నర్సంపేట , వర్ధన్నపేట లో ఐసిటిసి సెంటర్లు పనిచేస్తున్నాయని, ప్రతి పీహెచ్సీ లో హెచ్ఐవి టెస్టింగ్ సదుపాయం అందుబాటులో ఉందని ,అలాగే మొబైల్ వాహనం ద్వారా టెస్టింగ్ , కౌన్సిలింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయని , టీబీ ఆసుపత్రిలో ఉన్న సంపూర్ణ సురక్ష కేంద్రం ద్వారా అవగాహన కార్యక్రమములు ,టెస్టింగ్, వైద్య శిబిరములు నిర్వహించడం జరుగుతున్నది అన్నారు అలాగే స్వచ్ఛంద సంస్థలు హెచ్ఐవి నియంత్రణలో భాగస్వాములుగా పనిచేస్తున్నారన్నయని తెలిపినారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్. ఐ .ప్రకాష్,ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ విజయ్ కుమార్ , ఫిజియోథెరపిస్ట్ నర్సింహ రెడ్డి, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మేనేజర్ స్వప్న ,మాధురి ఐ.సీ.టీ.సి సూపర్వైజర్, పట్టణ కుటుంబ సంక్షేమ ఆరోగ్య సిబ్బంది , ఐ సి టి సి కౌన్సిలర్లు, టెక్నీషియన్లు , లింక్ వర్కర్స్ ,స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ,సూపర్వైజర్లు , ఏ.ఎన్.ఎం. లు, ఆశా కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు...