అదిలాబాద్ రిమ్స్, (ఆరోగ్య జ్యోతి): రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో చేరిన రోగికి రక్తం తక్కువగా ఉండటం వల్ల ఐటీడీఏ హెల్ప్ డిస్కో పనిచేస్తున్న కాశీరాం రక్తదానం చేశారు. రోగికి ఇమోగ్రం తక్కువగా ఉండటం వల్ల అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎక్కించాలని వైద్యులు వైద్య సిబ్బంది సూచించడంతో రోగి బంధువులు ఐటీడీఏ హెల్ప్ డిస్క్ ను సంప్రదించగా కాశీరాం రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా కాశిరాం మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల వెంటనే మనకో రక్తం వస్తుందని తెలిపారు. మూడవ నమ్మకాల వల్ల చాలామంది రక్తదానానికి ముందుకు రావడంలేదని తెలిపారు యువత ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా కాశిరం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సందీప్, ఆనంద్, భీమ్ రావు నీరజ్ తదితరులు ఉన్నారు