తెలంగాణ బ్యూరో, (ఆరోగ్య జ్యోతి):తెలంగాణ రాష్ట్రంలో అన్ని సంఘాల కన్నా ముందు ఉన్నాం. రాబోయే కాలంలో అన్ని రాష్ట్రాలలో కూడా తెలంగాణ కమ్యూనిటీ పారామెడిక్ వైద్యుల ఐక్య వేదిక ఏర్పాటు చేస్తాం. కేంద్రంలోని TCPMVAV జాతీయ స్థాయిలో సంఘం మరియు కమిటీ ఏర్పాటు చేస్తాం. తెలంగాణ ప్రజలకు మంచి నాయకత్వం అందించే సంఘం తెలంగాణ కమ్యూనిటీ పారామెడిక్ వైద్యుల ఐక్య వేదిక అని అనుకుంటున్నారు కాబట్టి ఆ వేవ్ లెన్త్ కు తగ్గట్టు మన ప్రవర్తన, పని విధానం, RMP ,PMP లను ప్రేమించే నేచర్ ఉండాలి. నా ఇంటికి పది మంది రాకపోతే నేను అవమానంగా భావిస్తాను. నా ఇంటికి రోజు పది పదిహేను మంది వస్తుంటారు... ఏదో రోజు ఒక్కరు ఇద్దరు మంది వస్తే నేను ఎక్కడో మిస్టేక్ చేశా అని అనుకుంటాను.
డాక్టర్ కి పేషంట్ విఐపి, లాయర్ కి క్లైంట్ విఐపి, నాకు RMP,PMP లే వీఐపీలు. నాయకుడు ఇంటికి RMP,PMP లు వస్తున్నారంటే నువ్వు పని చేస్తున్నట్టు లెక్క, నీ దగ్గరికి ఎవరు రాకుండా ఈగలు కొట్టుకుంటున్నావంటే నువ్వు నాయకుడివి కాదని లెక్క. నువ్వు గొప్పోడివి కాలేవు. నాయకుడు RMP ,PMP లకు ప్రేమను పంచే విధంగా ఉండాలి, కాలుకు ముల్లు విరిగితే పంటితో పీకే సర్వీస్ చేస్తానని విశ్వాసం కలిగించటమే నాయకుడి లక్షణం అని ఆయన పేర్కొన్నారు.