ప్రైవేటు ఆసుపత్రిలోనూ తనిఖీ చేసిన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి
April 09, 2025
అదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పలు ప్రైవేటు ఆసుపత్రులను జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీ చేయడం జరిగిందని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. ఈ తనిఖీల్లో భాగంగా వెంకటేశ్వర ఆస్పత్రి మరియు అంజుం ఆస్పత్రులను పరిశీలించడం జరిగిందని పేర్కొన్నారు. వెంకటేష్ వర ఆసుపత్రిలో ఆసుపత్రి ఫీజులు ఇతర చార్జీలకు సంబంధించిన రుసుము పట్టిక మరియు ఎక్స్రే వివరాలు లేని కారణంగా ఆస్పత్రి యజమానానికి నోటీసులు ఇవ్వడం జరిగినట్టు ఆయన పేర్కొన్నారు. అంజుమ్ ఆస్పత్రిని తనిఖీ చేయడం జరిగిందని అన్ని రకాల సర్టిఫికెట్లు మరియు సౌకర్యాలు ఉన్నాయని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేంద్ర రాథోడ్ తెలిపారు. తనిఖీ కార్యక్రమంలో ఇన్చార్జి జిల్లా మాస్ మీడియా అధికారి పి వెంకట్ రెడ్డి డి ఈ ఓ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.