విధులు విస్మరిస్తే కఠిన చర్యలు తప్పవు - జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్
April 17, 2025
. తాంసి (ఆరోగ్య జ్యోతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే ఆరోగ్య శాఖ సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహిస్తూ సమయానికి ఆసుపత్రికి వచ్చి వైద్య సేవలు అందించడంలో ముందుండాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు. గురువారం రోజు తాంసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది అందరూ ఉదయం 9 గంటలనుంచి సాయంత్రం 4:00 వరకు కచ్చితంగా ఉండాలని ఆయన సిబ్బందికి సూచించారు. సమయపాలన పాటించని సిబ్బందిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ముందుగా ఆస్పత్రిలోని అన్ని రికార్డులను పరిశీలించారు అనంతరం ఫార్మసీ గదిని పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్య సేవలు అందించడంలో వైద్య సిబ్బంది ముందు ఉండాలని తెలిపారు. ఆస్పత్రిలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఎండాకాలం కావడం వల్ల ఓఆర్ఎస్ తో పాటు ఫ్లూయిడ్ లు అందుబాటులో ఉండాలని తెలిపారు.