వరంగల్,(ఆరోగ్య జ్యోతి), హైదరాబాద్: తెలంగాణ
రాష్ట్రంలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్న సపోర్టింగ్ స్టాప్ కు వేతనాలు పెంచాలని జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో ముగ్గురిగా సపోర్టింగ్ స్టాఫ్ లు ఉన్నారు. ఒకరు ఎంఎన్ఏ, ఒకరు వాచ్ మెన్, మరోకరు స్వీపర్ లుగా పనిచేస్తున్నారు. సపోర్టింగ్ స్టాఫ్ నుంచి పేరును వేరు చేయాలని, కొందరు ఎస్సెస్సీ విద్యార్హత పొందిన వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి, వారి హెూదాను మెడికల్ అసిస్టెంట్ (లేదా) ఎంఎన్జగా ముగ్గురిలో ఒకరిని పేరు మార్చాలి, రాష్ట్ర వ్యాప్తంగా 824 మంది ఉన్నారని, ప్రస్తుతం వారి జీతం నెలకు రూ. 10000/- మాత్రమే ఉందన్నారు. పెరిగిన ఖర్చులతో, చాలీచాలని జీతాలతో జీవితాలు నెట్టుకురాలేక వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సపోర్టింగ్ స్టాఫ్ కు రూ.15600, ఎంఎన్ఏకు బేసిక్ వేతనం రూ.19500 జీతం ఇవ్వాలని రామ రాజేష్ ఖన్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.