విధులు విస్మరిస్తే కఠిన చర్యలు తప్పవు
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీకృష్ణ
అదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): వైద్య ఉద్యోగులందరూ తమ తమ విధులను సక్రమంగా నిర్వహించుకోవాలని ఆసుపత్రి కి వచ్చే రోగులపై ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని రకాల వైద్య సేవలు అందించాలని విధులు విస్మరించినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆదిలాబాద్ జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీకృష్ణ అన్నారు. మంగళవారం రోజు రిమ్స్ ఆవరణలో గల జిల్లా క్షయ నివారణ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. దీనితోపాటు ఏఆర్టీ సెంటర్ ఎన్సీడీ హెల్ప్ డెస్క్, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కి అనుబంధంగా ఉన్న అన్ని శాఖలను ఆయన పరిశీలించారు. పనితనం ఎలా ఉంది ఏ విధంగా పని చేస్తున్నారు రోగులకు ఎలా సేవలు చేస్తున్నారు రోగం వచ్చిన వెంటనే చికిత్సలు అందించి, ఉన్నత వైద్యం కోసం ఎక్కడికి పంపిస్తున్నారు. తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. విధులకు ఏ సమయానికి హాజరవుతున్నారు. దీనితోపాటు ఎంతమంది సిబ్బంది ఉన్నారు ఏమి విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బందికి గైర్హాజరవుతున్నారా అనే ప్రశ్నలతో అడిగి తెలుసుకున్నారు సిబ్బందిని. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా నివారణ అధికారి మరియు జిల్లా ఎన్సిడి ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీధర్ మెట్టపల్లి వార్, డాక్టర్ సాయి ప్రియ, ల్యాబ్ టెక్నీషియన్ బండారి కృష్ణ తదితరులు ఉన్నారు.