Sports & Games

Breaking News

ఘనంగా వయో వృద్ధుల దినోత్సవం

మహిళా శిశు సంక్షేమశాఖ కార్యాలయం లో వృద్ధులకు సంబందించిన సమస్యల పై టోల్ ఫ్రీ నెంబర్ 14567 కాల్ చేయవచ్చు.అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా మంగళవారం జడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో జిల్లా పాలనాధికారి రాజర్షి షా ముఖ్య అతిథిగా పాల్గొని అదనపు ఎస్పీ సురేందర్, జిల్లా సమైఖ్య అద్యక్షులు డాక్టర్ దేవిదాస్ దేశ్ పాండే లతో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించారు.ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 1 న నిర్వహించుకోవడం జరుగుతుందని, పెద్దల పట్ల నేటితరం చూపిస్తున్న వ్యవహారశైలిని పరిగణనలోకి తీసుకొని అంతర్జాతీయ స్థాయిలో ఈ సమస్యను చర్చించి వృద్ధుల దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించడం జరిగిందని ఆన్నారు.వయో వృద్ధులకు సంబందించిన చట్టాల పై అవగాహన కలిగివుండాలని, వయో వృద్ధులను నిర్లక్ష్యం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రతీ మండలం, డివిజన్ స్థాయిలో, గ్రామ స్థాయిలో వయో వృద్ధుల చట్టాల పై అవగాహన కల్పించాలని, అలాగే క్వార్టర్లీ రివ్యూ మీటింగ్ లు ఏర్పాటు చేసి వారికున్న సందేహాలు, సమస్యల పై నివృత్తి చేయాలనీ ఆన్నారు. వారం లో ఒకరోజు సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆన్నారు.వెల్ నెస్ సెంటర్ లలో కావలసిన అన్ని సదుపాయాలు సమకూర్చడం కొరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, హెల్త్ క్యాంప్ లు నిర్వహించడం జరుగుతుందనీ తెలిపారు.సీనియర్ సిటిజన్స్ హియరింగ్ కొరకు కలెక్టర్ ఛాంబర్ కి రావడం ఇబ్బందికరంగా ఉన్నందున ఇకనుండి కలెక్టరేట్ సమావేశం మందిరం లో ఏర్పాటు చేయడం , వయో వృద్ధుల గౌరవానికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అదనపు ఎస్పీ సురేందర్ మాట్లాడుతూ అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.జిల్లాలో నివసిస్తున్న ఒంటరి సీనియర్ సిటిజన్స్ వివరాలు ఇవ్వాలని, పోలీస్ తరుపున ఆన్ని సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.వయో వృద్ధుల అద్యక్షులు, మెంబర్లు తమ అభిప్రాయాలను తెలియజేశారు.అంతకు ముందు ఏర్పాటు చేసిన ECG, మెడికల్ క్యాంపులు సందర్శించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సురేందర్, RDO వినోద్ కుమార్ , dwo సబిత, DRDO సాయన్న, అదనపు dmho సాదన, వయోవృద్దుల జిల్లా సమైఖ్య అద్యక్షులు డాక్టర్ దేవిదాస్ దేశ్ పాండే, జనరల్ సెక్రటరీ రాంకులకర్ణి, డాక్టర్ సుధాకర్ సీనియర్ మెంబర్, కె.శివన్న, పల్ల సత్యనారాయణ, ఎన్. కిషన్. Cdpos, తదితరులు.