Sports & Games

Breaking News

ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన నర్రా రాజ్ కుమార్

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 


సిద్దిపేట : ప్రతిభకు పేదరికం, సమస్యలు అడ్డురావని నిరూపిస్తూ ఒక  విద్యార్థి ఏకంగా 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి శభాష్ అనిపించుకున్నాడు.. సిద్దిపేట మండలం పుల్లూరు గ్రామానికి చెందిన  దళిత విద్యార్థి నర్రా రాజ్ కుమార్ పట్టువదలకుండా పోటీ పరీక్షలు రాసి 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు.. 2019 లో మొట్టమొదట ప్రభుత్వ పంచాయతీ కార్యదర్శి గా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే మరింత ఉన్నత ఉద్యోగం సాధించాలనే పట్టుదల తో చదివి మిషన్ భగీరథ పథకం అమలులో కీలకంగా వ్యవహరించే AEE అసిస్టెంట్ ఎగ్జ్గ్యూటీవ్ ఇంజనీర్ ఉద్యోగాన్ని సాధించి హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా నియామక పత్రం అందుకున్నాడు. హుస్నాబాద్ సబ్ డివిజన్ లో తన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. సిద్దిపేట మండలం పుల్లూరు గ్రామం లో  చిరు ఉద్యోగి నర్రా రాజయ్య, లక్ష్మీ దంపతులకు పేద కుటుంబం లో జన్మించిన రాజ్ కుమార్ చిన్న తనం నుండే చదువులో ఉత్తమ ప్రతిభ కనబర్చే వాడు..