కాంగ్రెస్ ప్రభుత్వ ఆయంలోనే ఉద్యోగాలు
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
- రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్టాఫ్ నర్స్ లో కోరేగా పోస్టు భర్తీ చేయడం నుండి మొదలైన ఉద్యోగాల భర్తీ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లో భర్తీ చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం రోజు శిల్పకళా వేదికలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు వైద్య ఆరోగ్యశాఖ లో స్టాఫ్ నర్స్ పోస్టులతో పాటు ఫార్మసిస్టు ల్యాబ్ టెక్నీషియన్ తో పాటు అన్ని రకాల పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేయడం జరిగిందని తెలిపారు. ఇటీవల వివిధ శాఖల్లో ఎంపికైన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ లైబ్రేరియన్స్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ తో పాటు తదితరులకు 1635 మందికి నియామక పత్రాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం రాష్ట్ర మంత్రి సీతక్క మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలలో భక్తి వేగవంతంగా సాగుతుందని తెలిపారు ఇందుకుగాను 1635 మంది అభ్యర్థుల కు నియామక పత్రాలు అందించడం జరిగిందని తెలిపారు అపార్ట్మెంట్ ఆర్డర్ తీసుకున్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి సీతక్క. దసరాకు ముందు జరుగుతున్న అతిపెద్ద పండగ అని తెలిపారు . ఆర్డర్ తీసుకున్న వారందరూ అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు అన్ని రకాల పథకాలు అందే విధంగా చూడాలని తెలిపారు రకరకాల శాఖల్లో ఉద్యోగ పత్రాలు తీసుకున్నవారు ఆయా శాఖల్లో మంచిపని చేస్తూ గుర్తింపు పొందాలని తెలిపారు. వృత్తి బాధ్యతలను సరిగా నిర్వర్తిస్తే ప్రజల గుండెల్లో మనం జీవితాంతం నిలబడి ఉంటామని తెలిపారు మీ పనితనం శాశ్వతంగా నిలిచిపోయేలా సేవలందించాలని ఈ సందర్భంగా మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోహాజరైన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, కె.కేశవరావు, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.