పిల్లలకు క్రమం తప్పకుండా టీకాలు ఇప్పించాలి
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
కురివి,(ఆరోగ్యజ్యోతి): పిల్లలకు క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించాలని కురివి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని కొరివి-2 సబ్ సెంటర్ ఆరోగ్య కార్యకర్త దార్ల జ్యోతి అన్నారు. పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించడం వల్ల వ్యాధుల బారిన పడకుండా ఉంటారని ఆమె తెలిపారు. గర్భిణీ అని తెలిసిన వెంటనే గర్భవతులు ఆరోగ్య కార్యకర్త వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. నెల నెల క్రమం తప్పకుండా ఆరోగ్య కేంద్రానికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పిల్లలు పుట్టినప్పటినుంచి వ్యాధి నిరోధక టీకాలు క్రమం తప్పకుండా ఇప్పించాలని తెలిపారు.